![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఇందులో రోహిణి వాళ్ళ నాన్న సింహాద్రి ఈ షోకి వచ్చారు. శ్రీముఖి ఐతే రోహిణి వాళ్ళ నాన్నతో డాన్స్ లు చేయించింది, తొడ కొట్టించింది. "మొదటి సారి ఫ్లయిట్ ఎక్కి మరీ షూటింగ్ కి వచ్చారు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్" అని అడిగింది శ్రీముఖి. "ఆర్టిస్టులకు కూడా కార్ పెడతాం ఫ్లయిట్ పెడతాం అనే మర్యాదలు జరగవు కానీ ఈయన ఎక్కడో ఉన్నారు. రండి రండి ప్లీజ్ మీకు ఫ్లయిట్ పెడతాం అని రప్పించారు..మీరు నమ్మరు కానీ ఉదయాన్నే షూటింగ్ కి వెళ్తున్నాను అంటే మా నాన్న లేచి జ్యూస్ లు ఏమన్నా తినడానికి బాక్స్ లు రెడీ చేసి మా అమ్మా నాన్న రెడీ చేస్తారు.
అమ్మ చేయడం కామన్ కానీ నాన్న లేచి ఫ్రూప్ట్స్ అవీ కట్ చేసి బాక్స్ లు రెడీ చేయడం వంటివి చేస్తారు..నన్ను చిన్నప్పటి నుంచి చాల బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్యూ సో మచ్ అంటూ హ్యాపీ ఫాదర్స్ డే " అంటూ రోహిణి చెప్పింది. తర్వాత వీళ్ళు ఒక డంబ్ షో నిర్వహించింది. కొన్ని చిత్రాలను చూపిస్తూ ఉంటె ఎదురుగా ఉన్న వాళ్ళు వాటిని చెప్పాలి. ఐతే ఇందులో వేరే టీమ్ తో రోహిణి వాళ్ళ టీమ్ ఓడిపోయింది. దాంతో రోహిణి "నా యాక్టింగ్ ఎలా అనిపించింది" అంటూ వాళ్ళ నాన్నను అడిగింది. "నా యాక్టింగ్ ముందు నువ్వు చేసేది తక్కువే. ఉదయాన్నే లేచి జ్యూస్ లు చేసి ఫ్రూప్ట్స్ కట్ చేసి షూటింగ్ కి పంపిస్తే ఇదా నువ్వు చేసే యాక్టింగ్. మంచిగా గేమ్ గెలవాలని నేను నెల్లూరు నుంచి ఫ్లయిట్ లో వచ్చాను. ఇదేనా ఆట ?...నీ మీద కన్నా నేను బాగా ఆడాను అనుకుంటున్నాను...పబ్లిక్ అంతా చూస్తోంది కదా ఎవరు బాగా ఆడారో." అని చెప్పాడు. "నా యాక్టింగ్ కన్న తండ్రికే అర్ధం కాలేదు మిగతా ప్రజలకు ఎం అర్ధమవుతుంది" అంది కోపంతో రోహిణి. "అదే కదా నేను చెప్తున్నా" అన్నాడు రోహిణి వాళ్ళ నాన్న.
![]() |
![]() |